టాలీవుడ్ హీరో సినిమా టీమ్‌కు బెల్లంకొండ శ్రీనివాస్ బెస్ట్ విషెస్.. ట్వీట్ వైరల్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ హీరో శర్వానంద్‌(Sharwanandh) నటిస్తోన్న చిత్రాల్లో ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) ఒకటి.

టాలీవుడ్ హీరో సినిమా టీమ్‌కు బెల్లంకొండ శ్రీనివాస్ బెస్ట్ విషెస్.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో శర్వానంద్‌(Sharwanandh) నటిస్తోన్న చిత్రాల్లో ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) ఒకటి. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌(Samyukatha Menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ క్రమంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మూవీకు బెస్ట్ విషెస్ తెలుపుతూ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘ఈ రోజు విడుదలైన నారి నారి నడుమ మురారి నిర్మాతలకు శుభాకాంక్షలు. శర్వానంద్, సంయుక్త మీనన్ మరియు సాక్షి వైద్యలకు శుభాకాంక్షలు. నిర్మాత అనిల్ సుంకర గారికి శుభాకాంక్షలు. ముందుకు సాగుతున్న విజయవంతమైన చిత్రానికి శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story