Bellamkonda Sai Srinivas: నన్ను చూసే నా ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు.. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

ఇండస్ట్రీ ఒక సముద్రం లాంటిది.. ఇక్కడ ఎవరూ మనవాళ్లు ఉండరు అంటున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

Bellamkonda Sai Srinivas: నన్ను చూసే నా ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు.. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీ ఒక సముద్రం లాంటిది.. ఇక్కడ ఎవరూ మనవాళ్లు ఉండరు అంటున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ హీరో లేటెస్ట్ మూవీ ‘కిష్కింధపురి’. హారర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను హారర్ ఎక్స్‌పీరియన్స్‌ను పరిచయం చేశాయి. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 12న విడుదల కానుండగా.. తాజాగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘ఇండస్ట్రీ ఒక సముద్రం లాంటిది. అక్కడ ఎవరూ సొంతవాళ్లు, మనవాళ్లు ఉండరు. ఎవరి స్వార్థం వాళ్లదే. ఇండస్ట్రీలో దిగిన వాళ్లకు మాత్రమే దానిలోతు తెలుస్తుంది. అయితే.. ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ బయట ఉన్నంత స్వచ్ఛంగా ఇక్కడ ఉండరు. మనతో బాగానే ఉంటారు. మనం పక్కకు వెళ్లగానే మన గురించి మాట్లాడం స్టార్ట్ చేస్తారు. నేనెప్పుడూ ఎవరి గురించి తప్పుగా మాట్లాడను. చిన్నప్పటి నుంచి అంతే.. గాసిప్స్ వినను మాట్లాడను’ అని తెలిపాడు. ఇంకా మాట్లాడుతూ.. ‘నా సినిమాలకు మా నాన్న ప‌రోక్షంగా పెట్టుబ‌డి పెట్టిన సంగతి నిజ‌మే. అయితే.. నన్ను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. న‌న్ను, నా టాలెంట్ చూసే నా ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు’ అరి తెలిపాడు.

Next Story