పెళ్లి కొడుకు గెట‌ప్ లో టాలీవుడ్ హీరో.. ఫోటోలు వైర‌ల్

by velandi.Saikiran |

పెళ్లికొడుకుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మారారు.

పెళ్లి కొడుకు గెట‌ప్ లో టాలీవుడ్ హీరో.. ఫోటోలు వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి, పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో బెల్లంకొండ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇందులో భాగంగానే ఇవాళ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి కొడుకు గెటప్ లో కనిపించారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి జాలిగా కనిపించారు. ఈ ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి ఎప్పుడు అంటే

నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ వివాహం ఏప్రిల్ 29వ తేదీన తిరుమలలో జరగనుంది. కావ్యా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తిరుమలలో వివాహ కార్యక్రమం జరగనుండగా.. రిసెప్షన్ మాత్రం మే ఒకటో తేదీన హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ, సినీ ప్రముఖులకు పెళ్లి ఆహ్వాన పత్రికలు అందాయి. ఇది ఇలా ఉండగా ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో సన్నిహితుల మధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది.

Next Story