- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bellamkonda Srinivas: హారర్ మూవీతో రాబోతున్న యంగ్ హీరో బెల్లంకొండ.. భయంకరంగా ఆకట్టుకుంటోన్న వీడియో
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు.

దిశ, సినిమా: యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘భైరవం’ (Bhairavam) ఒకటి. విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నారా రోహిత్ (Nara Rohit), మంచు మనోజ్ (Manchu Manoj) కీలక పాత్రల్లో నటిస్తుండగా.. అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. మూవీపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయింది. అయితే.. చాలా రోజుల నుంచి ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడుతూనే వస్తుంది. ఇక ఇప్పుడు కూడా ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్స్ జరగకపోవడంతో.. ఈ సారి కూడా ‘భైరవం’ మూవీ వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానప్పటికీ శ్రీనివాస్ మాత్రం మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు.
‘కిష్కింద పురి’ (Kishkinda Puri) అనే వక్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ హారర్ థ్రిల్లర్ (Horror thriller) చిత్రానికి ‘చావు కబురు చల్లగా’ డైరెక్టర్ కౌషిక్ పెగల్లపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి టైటిల్ గ్లింప్స్(Title Glimpses)ను ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ.. ఓ వీడియో షేర్ చేశారు. ‘నా నడకకు గయ్యం లేదు.. నా ఒంటికి చలనం లేదు.. నా మనసుకి మార్గం లేదు.. ఎందుకంటే నాకు ప్రాణం లేదు’ అనే వాయిస్ ఓవర్‌తో వచ్చిన ఈ వీడియోలో ‘కిష్కిందపురిలో నడిచేవన్నీ బతికిఉన్నట్లు కాదు’ అనే క్యాప్షన్ సినిమాపై క్యూరియాసిటీకి పెంచేస్తుంది. దీంతో.. టైటిల్ గ్లింప్స్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
#కిష్కిందపురి Title Glimpse 18న !#BellamkondaSrinivas #AnupamaParameswaran pic.twitter.com/hnyAnBGYHh
— Rajesh Manne (@rajeshmanne1) April 16, 2025






