- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరుణాకరన్ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్
బెల్లంకొండ గణేష్ – కరుణాకరన్ కాంబోలో కొత్త సినిమా

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు అయిన బెల్లంకొండ గణేష్ ఇప్పటికే ‘స్వాతిముత్యం’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రం తర్వాత ఆయన ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీ మాత్రం ఈ నటుడికి నిరాశను మిగిల్చింది.
ఈ సినిమా తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న ఈ యువ నటుడు, ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో తదుపరి మూవీ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ గణేష్‌కు ఒక స్టోరీ వినిపించగా, అది నచ్చడంతో ఈ క్రేజీ కాంబోలో సినిమా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 13వ తేదీన పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.






