Beauty: ఎమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంటున్న ట్రైలర్..

by Chukka Sudharani |

జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మి్స్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్యూటీ’.

Beauty: ఎమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంటున్న ట్రైలర్..
X

దిశ, సినిమా: జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మి్స్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్యూటీ’. ప్రేమ కథతో పాటు అంతకు మించిన కుటుంబ విలువలు, ఫాదర్ డాటర్ రిలేషన్, ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వ వహించగా.. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన గ్లింప్స్, మోషన్ పోస్టర్, పాటలు, టీజర్‌కు మంచి స్పందన రాగా.. ఈ సినిమా మంచి అంచనాల మధ్య సెప్టెంబర్ 19న విడుదల కాబోతుంది.

ఈ క్రమంలోనే తాజాగా యువ సామ్రాట్ నాగ చైతన్య బ్యూటీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘ఎప్పుడైనా నేను నిన్ను కొప్పడితే నన్ను అలా వదిలి పెట్టి వెళ్ళకు.. నిన్ను వదిలేసి వెళ్ళడం అంటే.. నా ఊపిరి వదిలేయడమే కన్నా’ అంటూ హీరో హీరోయిన్లు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ కాగా.. స్కూటీ కొనిస్తాను అని తండ్రి మాట ఇవ్వడం, మిడిల్ క్లాస్ ఫాదర్ ఎమోషన్స్ ‘క్యాబ్ డ్రైవర్ అయితే క్యాబ్ డ్రైవర్‌లా ఉండాలి గానీ కలెక్టర్‌లా ప్రామిస్ చేయొద్దు’ అనే డైలాగ్ ప్రతీ ఒక్కరిని కదిలించేలా ఉంది. ప్రజెంట్ ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Next Story