నిను కసిరిన సమయాన.. ‘స్కై’ నుంచి బ్యూటిఫుల్ సాంగ్

by Sujitha Rachapalli |

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కై’. వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు పృథ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నాడు.

నిను కసిరిన సమయాన.. ‘స్కై’ నుంచి బ్యూటిఫుల్ సాంగ్
X

దిశ, సినిమా : మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కై’. వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు పృథ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతున్న మూవీ నుంచి తాజాగా ‘నిను కసిరిన సమయాన’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ శివ ప్రసాద్ సంగీతం అందించగా.. డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల లిరిక్స్ అందించాడు. వైష్ణవి ఆకట్టుకునేలా పాడింది. ‘నిను కసిరిన సమయాన.. నను మరచిన నా హృదయం.. అడుగడుగున నిను వెతికి.. అణువణువున నిను తలచి.. ఆలోచనంతా నీ వెనకే.. ఆరాధనంతా నీ కొరకే..’ అంటూ లవ్ ఫీల్‌తో సాగింది. ‘స్కై’ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ‘తపనే తెలుపగ..’, ‘పోయేకాలం నీకు..’, ‘నిన్ను చూసిన..’ సాంగ్స్ చాట్ బస్టర్స్‌గా మారి మిలియన్ వ్యూస్ రీచ్ కాగా ఈ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ఆదరణ పొందుతుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

Next Story