రష్మికకు ఘోర అవమానం.. సెల్ఫీల కోసం వచ్చి!

by velandi.Saikiran |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే

రష్మికకు ఘోర అవమానం.. సెల్ఫీల కోసం వచ్చి!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయింది ఈ అందాల తార రష్మిక. అయితే అలాంటి హీరోయిన్ రష్మిక మందాన జనాల్లోకి వస్తే.. ఎలా ఉంటుందో తెలుసా..? జనాలు ఎగబడడం ఖాయం. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. జీ సినిమా అవార్డ్స్ ఈవెంట్ కు తాజాగా హీరోయిన్ రష్మిక వెళ్ళాడు.

ఈ సందర్భంగా బ్లాక్ డ్రెస్ లో మెరిసిన రష్మిక.. ఈవెంట్ లో సందడి చేశారు. ఇక అక్కడే ఉన్న తన అభిమానులతో... కలిసి ఫోటోలు దిగారు. ఒక అడుగు ముందుకేసి వాళ్ళ మధ్యలో రష్మిక కూర్చున్నారు. ఈ సందర్భంగా అభిమానులంతా ఎగబడి సెల్ఫీలు తీసుకున్నారు. అయితే కొంతమంది ఓవర్ గా రియాక్ట్ అయి ఆమెపై చేతులు వేసే ప్రయత్నం చేశారు.

ఇక ఇది గమనించిన రష్మిక వెంటనే అక్కడి నుంచి వచ్చి స్టేజి పైకి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నేటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అనవసరంగా వాళ్ల మధ్యలోకి ఎందుకు వెళ్లావు? జనాల్లోకి వెళ్తే నలిపేస్తారు అంటూ సూచనలు చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. మరికొందరైతే దూల తీరిందా? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. కాగా తెలుగులో పుష్ప, బాలీవుడ్ లో యానిమల్ సినిమాలు వరుసగా సక్సెస్ కావడంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా.. ఉన్నత శిఖరాలకు చేరుకుంది.

Next Story