- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘3 BHK’ సినిమా నుంచి బ్యూటీఫుల్ ఫ్యామిలీ మెలోడీ కలలన్నీ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్
సిద్ధార్థ్(Siddharth) హీరోగా శ్రీ గణేష్ (Shri Ganesh)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘3 BHK’.

దిశ, సినిమా: సిద్ధార్థ్(Siddharth) హీరోగా శ్రీ గణేష్ (Shri Ganesh)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘3 BHK’. బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్(Sharathkumar), దేవయాని, యోగి బాబు(Yogi Babu) కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ వచ్చింది. ఈ చిత్రానికి అమృత్ రామ్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. దినేష్ కృష్ణన్ బి & జితిన్ స్టానిస్లాస్ డీవోపీ గా పని చేస్తున్నారు. గణేష్ శివ ఎడిటర్. రాకేందు మౌళి డైలాగ్ రైటర్. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జూలై 4న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, మూవీ మేకర్స్ ‘కలలన్నీ’ సాంగ్‌ను రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అమృత్ రామ్‌నాథ్ ఈ పాటని బ్యూటీఫుల్ ఫ్యామిలీ మెలోడీగా కంపోజ్ చేశారు. రాకేందు మౌళి రాసిన రిలీజ్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది. హేమచంద్ర వేదాల, గోపికా పూర్ణిమ, సాహితీ చాగంటి, పి విఎన్ఎస్ రోహిత్ ప్రజెంట్ వోకల్స్ తో ఆకట్టుకున్నారు. సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని క్యారెక్టర్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ సాంగ్ లో ప్రత్యేకంగా నిలిచాయి.






