దేశద్రోహులతో నిండిన ప్రపంచంలో దేశభక్తుడిగా ఉండండి.. పేట్రియాట్ నుంచి మరో నటుడు ఫస్ట్ లుక్ రిలీజ్..

by I. Sairam |   (  Updated:2026-01-26 05:46:30  IST  )

మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘పేట్రియాట్’.

దేశద్రోహులతో నిండిన ప్రపంచంలో దేశభక్తుడిగా ఉండండి.. పేట్రియాట్ నుంచి మరో నటుడు ఫస్ట్ లుక్ రిలీజ్..
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘పేట్రియాట్’. అయితే పదిహేడేళ్ల తర్వాత వీరి కాంబో తెరపైకి రానుండటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనికి మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పుష్ప మూవీ ఫేమ్ ఫహాద్ ఫాజిల్, నయనతార కీ రోల్ ప్లే చేస్తున్నారు.

అయితే ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 9న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి నటుడు ఫహాద్ ఫాజిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘భిన్నాభిప్రాయమే దేశభక్తి, దేశద్రోహులతో నిండిన ప్రపంచంలో దేశభక్తుడిగా ఉండండి’ అని రాసుకొచ్చారు మూవీ టీమ్. ఇక పోస్టర్ బ్లాక్ బ్యాక్ గ్రౌండ్‌లో చూడటానికి ఈ నటుడు చాలా సీరియస్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story