Bapu: బాపు.. ఏ ఫాదర్ సూసైడ్ స్టోరీ.. ఉత్కంఠంగా టీజర్

by Chukka Sudharani |   (  Updated:2025-07-28 16:11:32  IST  )

సీనియర్ నటీనటులు బ్రహ్మాజీ (Brahmaji), ఆమని (Aamani) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాపు’ (Bapu).

Bapu: బాపు.. ఏ ఫాదర్ సూసైడ్ స్టోరీ.. ఉత్కంఠంగా టీజర్
X

దిశ, సినిమా: సీనియర్ నటీనటులు బ్రహ్మాజీ (Brahmaji), ఆమని (Aamani) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాపు’ (Bapu). ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ (A Father's Suicide Story) అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ మూవీని నిజ జీవిత ఘటనల ఆధారంగా దర్శకుడు దయా (Director Daya) తెరకెక్కిస్తున్నాడు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో బలగం సుధాకర్‌ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ప్రమోషన్స్‌‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా నేషనల్ క్రష రష్మిక మందన్న (Rashmika Mandanna) చేతుల మీదుగా ‘బాపు’ సినిమా టీజర్‌ను విడుదల చేయించారు. ఇక టీజర్ (Teaser) విషయానికి వస్తే.. ఓ ఇంటి పెద్ద చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమాని రూపొందించారని అర్థమవుతోంది. ఎమోషన్‌తో పాటు ఫన్‌, లవ్‌ అంశాలతో కూడిన ఈ టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. బ్రహ్మాజీ, బలగం సుధాకర్‌రెడ్డి మధ్య చావు గురించి జరిగే సంభాషణలతో టీజర్ స్టార్ట్ కగా.. మధ్యలో ఓ కొత్త జంట లవ్ స్టోరీతో పాటు, శ్రీనివాస్ అవసరాల, ధన్యబాలకృష్ణ ప్రేమకథను కూడా చూపించారు. తర్వాత సస్పెన్స్ డ్రామాతో ఉత్కంఠ రేకెత్తించేలా టీజర్‌ను కట్ చేశారు. చివరికి బలగం సుధాకర్ రెడ్డి ఇచ్చిన ట్విస్ట్ నవ్వు తెప్పించేలా చాలా ఇంట్రెస్టింగ్‌గా బాపు టీజర్ ఉంది. ప్రజెంట్ ఈ టీజర్ వైరల్ అవుతుండగా మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయంటూ కామెంట్స్ చేస్తు్న్నారు నెటిజన్లు.

Click For Video..

Next Story