- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనీల్ రావిపూడి, వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కాంబోకు బ్యానర్ ఫిక్స్
'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ చిత్రం.

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, హిట్ మిషన్ అనిల్ రావిపూడి కొలాబరేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు రాబోతున్నది. విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి క్లీన్‌గా, అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ కొత్త ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నాడు. హాస్యం, భావోద్వేగాలు, పండగ వాతావరణం అన్నీ కలిసి ఈ సినిమాను ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి ట్రీట్‌గా 2027లో తీసుకొచ్చేందుకు ప్లాన్‌లో ఉన్నాడు డైరెక్టర్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్స్ జరుగుతుండగా.. తాజాగా ఈ సినిమాకు నిర్మాణ సంస్థ ఫిక్స్ అయినట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు అనిల్ రవిపూడి. 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై సాహు గారపాటి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. ఈ బ్యానర్ ఇప్పటికే 'భగవంత్ కేసరి' రీజినల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'మన శంకర వరప్రసాద్ గారు' వంటి వరుస విజయాలను అందించింది. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, జీ స్టూడియో సహ-నిర్మాతగా చేరింది. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు భారీగా పెరిగాయి.






