11 నెలలుగా ఇంటి ఈఎంఐ కట్టని హీరో.. వేలం వేస్తామని నోటీసులు

by Malleboina Mahesh |

వరుస వివాదాలతో సతమతం అవుతున్న తమిళ హీరో జయం రవికి మరో ఊహించిన షాక్ తగిలింది. బ్యాంక్ లోనుతో చెన్నై ఇంజంబక్కం ప్రాంతంలోని విలాసవంతమైన బంగ్లాను నిర్మించుకున్నాడు.

11 నెలలుగా ఇంటి ఈఎంఐ కట్టని హీరో.. వేలం వేస్తామని నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: వరుస వివాదాలతో సతమతం అవుతున్న తమిళ హీరో జయం రవి (Hero Jayam Ravi)కి మరో ఊహించిన షాక్ తగిలింది. బ్యాంక్ లోనుతో చెన్నై ఇంజంబక్కం ప్రాంతంలోని విలాసవంతమైన బంగ్లాను నిర్మించుకున్నాడు. అయితే తన భార్య ఆర్తితో గొడవలు, విడాకుల నేపథ్యంలో జయం రవి గత 11 నెలలుగా ఈఎంఐ (EMI)లు చెల్లించలేదు. దీంతో అప్రమత్తం అయిన ప్రైవేటు బ్యాంకు అధికారులు తన ఇంటికి నోటీసులు అతికించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

ఆ నోటీసుల్లో 11 నెలలుగా ఇంటి ఈఎంఐ కట్టడం లేదని, వెంటనే ఫైన్ తో పాటు 11 నెలల ఈఎంఐ (11 months EMI) కట్టాలని, లేకుంటే ఇంటిని వేలం (auction) వేస్తామని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. కాగా జయం రవి (Jayam Ravi)కి సంబంధించి ఇది ఒకే ఆర్థిక వివాదం కాదు. గతంలో ఆయన మాజీ భార్య ఆర్తి రవి నుండి విడాకుల సమయంలో నెలకు రూ.40 లక్షల ఆలిమనీ (వితంతు భత్యం) కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇది కూడా ఆయన ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జయం రవి తన ఆర్థిక వ్యవహారాలను సరిచేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా బ్యాంక్ నోటీసుల (Bank notices)పై హీరో జయం రవి ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Next Story