- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు వాళ్లంతా ఉలిక్కి పడే సినిమా చేస్తా: బండ్ల గణేశ్
తెలుగు వాళ్లంతా ఉలిక్కి పడే సినిమా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేశ్.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో బండ్ల గణేష్ కు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ఒకప్పుడు చిన్నపాటి నటుడిగా మెరిసిన బండ్ల గణేష్, ఆ తర్వాత నిర్మాతగా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోలతో సినిమా చేసి మంచి సక్సెస్ లు ఎన్నో అందుకున్నాడు. అయితే అలాంటి బండ్ల గణేష్ తాజాగా కీలక ప్రకటన చేశాడు. తెలుగు వాళ్ళంతా ఉలిక్కిపడే సినిమా చేస్తానంటూ వెల్లడించాడు. పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో నిర్మాత బండ్ల గణేష్ పేర్కొన్నారు.
తెలుగు వాళ్ళంతా ఉలిక్కిపడేలా ఈ సినిమా తీస్తానని, ఈ సినిమాతో తన పరమేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ ను ఆపేయాలనేది కోరిక అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ సినిమా చేసిన తర్వాత తాను చెప్పినట్లుగానే చేస్తానని వివరించారు. పవన్ కళ్యాణ్ తనకు దేవుడు లాంటి వాడని గుర్తు చేశారు. ఇది ఇలా ఉండగా పరమేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ లో ఇప్పటి వరకు ఆంజనేయులు, గబ్బర్ సింగ్, ఇద్దరమ్మాయిలతో, నీ జతగా నేనుండాలి, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ లాంటి సినిమాలు వచ్చాయి.






