వాళ్ళను కూడా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి.. బండ్ల గణేష్ సంచలన ట్వీట్

by Gantepaka Srikanth |

హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహంచిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వాళ్ళను కూడా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి.. బండ్ల గణేష్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహంచిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్న వారిని బహిష్కరించే (బ్యాన్ చేసే) విధానం అమలులో ఉంది. ఇదే తరహాలో తెలుగులో కూడా అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీని కోసం తమ తెలుగు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ద్వారా విస్తృత చర్చలు జరుపుతామని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, డ్రగ్స్ తీసుకునే నటీనటులు, సాంకేతిక నిపుణులు, లేదా చిత్ర పరిశ్రమలో ఎవరైనా సరే, వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. అయితే.. దిల్ రాజు వ్యాఖ్యలపై తాజాగా మరో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘డ్రగ్స్ తీసుకునే వారితో పాటు బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఆడే వాళ్ళను కూడా బ్యాన్ చేస్తే బాగుంటుందని నా విన్నపం’ అని షాకింగ్ డిమాండ్ పెట్టారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ట్వీట్

Next Story