Pawan Kalyan : పవన్ కల్యాణ్ బర్త్ డే వేళ బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-02 03:36:41  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు(Pawan Kalyan Birthday) సందర్భంగా సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు విషెస్ చెబుతున్నారు.

Pawan Kalyan : పవన్ కల్యాణ్ బర్త్ డే వేళ బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు(Pawan Kalyan Birthday) సందర్భంగా సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు విషెస్ చెబుతున్నారు. తాజాగా తనతైన శైలిలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్(Bandla Ganesh) చెప్పిన శుభాకాంక్షలు మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాయి. ‘చరిత్రలో ఒకే ఒక్కడు. కోట్ల మంది గుండెల్లో ఆశాజ్యోతిగా మారిన మహోన్నత వ్యక్తి పవన్ కల్యాణ్. మీ పుట్టుకే ఒక అద్భుతం. హ్యాపీ బర్త్ డే మై బాస్. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా, మహోన్నతంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అని బండ్ల గణేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, పవన్ కల్యాణ్‌ హీరోగా బండ్ల గణేష్‌ రెండు సినిమాలు నిర్మించారు. తీన్ మార్, గబ్బర్ సింగ్ చిత్రాలు నిర్మించాడు. తీన్‌మార్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. కానీ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.

Next Story