నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. పవన్ కల్యాణ్ నిర్మాత ట్వీట్ వైరల్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-12 12:36:09  IST  )

నందమూరి ఫ్యామిలీ(Nandamuri Family) నుంచి మరో హీరో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే.

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. పవన్ కల్యాణ్ నిర్మాత ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి ఫ్యామిలీ(Nandamuri Family) నుంచి మరో హీరో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. నందమూరి హరికృష్ణ(Nandamuri Harikrishna) పెద్ద కుమారుడు జానకీరామ్ కొడుకు తార‌క రామారావు(Taraka Rama Rao) హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ విషయాన్ని ఇవాళ అధికారికంగా ప్రకటించారు. వైవీఎస్ చౌదరి రామారావును పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాలో తెలుగమ్మాయి వీణారావు హీరోయిన్ నటిస్తోది. రోర్స్ బ్యానర్‌పై సినిమా ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఇవాళ సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ ఓపెనింగ్‌కి సీనియర్ ఎన్టీఆర్ కూతుళ్లు పురంధేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, కొడుకులు మోహన కృష్ణ, రామకృష్ణ హాజరయ్యారు. అలాగే బాలయ్య భార్య వసుంధర, మరికొంతమంది ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. తాజాగా తారక రామారావు ఎంట్రీపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అతనికి విష్ చేస్తూ పోస్టు పెట్టారు. ‘‘నందమూరి హరికృష్ణ మనవడు, దివంగత నందమూరి జానకీరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు నేడు సినీ రంగంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. సినీరంగంలో తన ప్రస్థానం విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ఎక్స్‌లో బండ్ల గణేష్ పేర్కొన్నారు.




Next Story