బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న ట్వీట్‌..బ‌న్నీ వాసును ఉద్దేశించేనా !

by velandi.Saikiran |   (  Updated:2025-10-16 08:36:07  IST  )

బండ్ల గణేష్ తాజాగా సంచలన పోస్ట్ పెట్టారు. అది పీకుతా, ఇది పీకుతా అని చెప్పాల్సిన పనిలేదు... మాటలు మన చేతిలో

బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న ట్వీట్‌..బ‌న్నీ వాసును ఉద్దేశించేనా !
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెట్టి, వార్తల్లో నిలుస్తూ ఉంటారు బండ్ల గణేష్. అదే సమయంలో ఏదైనా సినిమా ఫంక్షన్ కు వెళ్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసి తెగ పొగిడేస్తుంటారు. ఇక బండ్ల గణేష్ ఎప్పుడైనా టీవీ డిబేట్లో కూర్చుంటే పెద్ద వివాదమే జరుగుతూ ఉంటుంది. అలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి.

అయితే అలాంటి బండ్ల గణేష్ తాజాగా సంచలన పోస్ట్ పెట్టారు. అది పీకుతా, ఇది పీకుతా అని చెప్పాల్సిన పనిలేదు... మాటలు మన చేతిలో ఉన్నప్ప‌టికీ, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు అంటూ పోస్ట్ పెట్టారు. బండ్ల గణేష్ ఈ పోస్టు పెట్టగానే క్షణంల్లోనే వైరల్ గా మారింది. దీంతో సినిమా అభిమానులు, నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. బండ్ల గణేష్ ఎవరినో ఉద్దేశించి కావాలనే ఈ పోస్ట్ పెట్టాడని కామెంట్స్ పెడుతున్నారు. మొన్న బన్నీ వాసు చేసిన కామెంట్లకు ఇప్పుడు బండ్ల గణేష్ పరోక్షంగా స్పందించాడని మరికొంతమంది పేర్కొంటున్నారు.

అనవసరంగా బన్నీ వాసును గెలకకూడదని మరి కొంత మంది సూచిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ మూవీ మిత్ర మండలి. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తన సినిమాపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారని, వాళ్లు తన వెంట్రుక కూడా పీకలేరని ఆయన వార్నింగ్ ఇచ్చారు. బన్నీ వాసు ఈ వ్యాఖ్యలు చేసిన‌ రెండు రోజులకే బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. క్లిక్

Next Story