- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండ్ల గణేష్ సంచలన ట్వీట్..కృతఙ్ఞత లేని మనిషి అంటూ !
పవన్ కళ్యాణ్ ను పట్టించుకోవడం లేదు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే... బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేశారు. కొంతమంది

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో అదిరిపోయే స్పీచ్ లు ఇచ్చే బండ్ల గణేష్...సోషల్ మీడియాలో కూడా సంచలన పోస్టులు పెట్టి రచ్చ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జపం చేస్తూ... నిత్యం ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. గతంలో తనకు హిట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు నేను భక్తుడిని అంటూ పొగుడుతూ ఉంటారు. అయితే.. అలాంటి బండ్ల గణేష్.. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఊసే ఎత్తడం లేదు.
లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి లాంటి చిన్న హీరోలను మెచ్చుకుంటూ..పవన్ కళ్యాణ్ ను పట్టించుకోవడం లేదు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే... బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేశారు. కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరని...నీవు చేయని వాటినే మాత్రమే చూస్తారని బాంబ్ పేల్చారు. కృతఙ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు అంటూ సంచలన ట్వీట్ చేశారు. అయితే... ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి... చేసినట్లు ఉందని నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. మొన్న ఓజీ ఈవెంట్ జరిగితే పిలవలేదని బండ్ల హర్ట్ అయ్యాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో బండ్ల గణేష్ పోస్ట్ వైరల్ గా మారింది. క్లిక్






