- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెప్పుకోలేని బాధ, వేదన.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
ఆల్మోస్ట్ అన్ని అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటాడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. తాజాగా సెకండ్ బ్యానర్ బండ్ల గణేష్ బ్యానర్స్ తీసుకున్నట్లు ప్రకటించిన ఆయన.. ఇప్పుడు 2025తో అనుబంధం గురించి రాసుకొచ్చాడు.

దిశ, సినిమా : ఆల్మోస్ట్ అన్ని అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటాడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. తాజాగా సెకండ్ బ్యానర్ బండ్ల గణేష్ బ్యానర్స్ తీసుకున్నట్లు ప్రకటించిన ఆయన.. ఇప్పుడు 2025తో అనుబంధం గురించి రాసుకొచ్చాడు. “2025 సంవత్సరం ముగుస్తోంది అనగానే నా హృదయం భారంగా మారుతోంది. ఎందుకంటే ఇది కేవలం ఒక సంవత్సరం కాదు…నా జీవితాన్ని తిరిగి రచించిన కాలం. నా బతుకుకి కొత్త అర్థం, కొత్త దారి చూపించిన మహత్తర సమయం. భగవంతుడు స్వయంగా మనుషుల రూపంలో నా జీవితంలో అడుగుపెట్టి, నేను ఊహించనంత ప్రేమను, అండను, అద్భుతాలను ప్రసాదించిన సంవత్సరం ఇది. ఇలాంటి దివ్యమైన రోజులు వెళ్ళిపోతున్నాయంటే.. ఎందుకో చెప్పలేని బాధ, మధురమైన వేదన కలుగుతోంది. భగవంతుని నేను ఒక్కటే ప్రార్థిస్తున్నాను.. 2025 లాగా ఆశ నింపే రోజులు, విశ్వాసాన్ని బలపరిచే సంఘటనలు, సంకల్పాన్ని దృఢం చేసే అనుభవాలు.. రాబోయే ప్రతి సంవత్సరంలో కూడా నాకు, మన అందరికీ దక్కాలి.. అందరి జీవితాల్లో వెలుగు నిండాలి.. అందరి ప్రయాణాలు అర్థవంతంగా మారాలి.. అదే నా హృదయపూర్వక సంకల్పం’’ అని రాసుకొచ్చాడు.






