మరో నిర్మాణ సంస్థను ప్రకటించిన బండ్ల గణేశ్.. పేరు ఇదే..

by Sujitha Rachapalli |

నటుడిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్, మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఆంజనేయులు' చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాతోనే ఆయన తన సొంత బ్యానర్ ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ను ప్రారంభించారు. పవర్

మరో నిర్మాణ సంస్థను ప్రకటించిన బండ్ల గణేశ్.. పేరు ఇదే..
X

దిశ, సినిమా : నటుడిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్, మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఆంజనేయులు' చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాతోనే ఆయన తన సొంత బ్యానర్ ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ను ప్రారంభించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సంచలన బ్లాక్‌బస్టర్ 'గబ్బర్ సింగ్' చిత్రంతో ఈ బ్యానర్‌కు మొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లభించింది. ఈ సినిమా బండ్ల గణేష్‌ను ఒక విజయవంతమైన నిర్మాతగా సుస్థిరం చేసింది. ఆ విజయం స్ఫూర్తితో, ఈ బ్యానర్ 'బాద్‌షా', 'ఇద్దరమ్మాయిలతో', 'టెంపర్' వంటి అనేక ప్రతిష్టాత్మక, కమర్షియల్‌గా విజయవంతమైన చిత్రాలను నిర్మించి తెలుగు సినిమాలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తన కొత్త నిర్మాణ సంస్థ ‘బండ్ల గణేష్ బ్లాక్‌బస్టర్స్ (బీజీ బ్లాక్‌బస్టర్స్)’ను అనౌన్స్ చేశారు. ఈ కొత్త అధ్యాయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే విషయం ఏమిటంటే.. ఇందులో నెక్స్ట్ జనరేష్ భాగస్వామ్యం కావడం. ఇప్పటికే ఓ ప్రాజెక్ట్ ఖరారు కాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Next Story