- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేష్‌ను కలిసిన బండ్ల గణేష్.. అసలు మ్యాటర్ అదే
కుమార్తె జనని వివాహ ఆహ్వానం అందించేందుకు బండ్ల గణేష్, మహేష్ బాబు-నమ్రత దంపతులను వ్యక్తిగతంగా కలిశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్, మహేష్ కుటుంబాన్ని ఎందుకు కలుసుకున్నారనే విషయానికి వస్తే.. ఆయన కుమార్తె జనని ఎంగేజ్‌మెంట్ కొంతకాలం క్రితమే జరిగింది. మరికొద్ది రోజుల్లో ఆమె వివాహం జరగనున్న నేపథ్యంలో, బండ్ల గణేష్ తన సతీమణి, ఇద్దరు కుమారులతో కలిసి మహేష్ బాబు, నమ్రత దంపతులను వ్యక్తిగతంగా కలిసి పెళ్లికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా వారికి వివాహ ఆహ్వాన పత్రికను అందించి, కుటుంబ సమేతంగా వేడుకకు హాజరు కావాలని కోరినట్లు సమాచారం. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఇక బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నప్పటికీ, చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.






