టాలీవుడ్ హీరోకు ప‌బ్లిక్ గా కిస్ పెట్టిన బండ్ల గ‌ణేష్‌ !

by velandi.Saikiran |

హీరో మౌళిని ప్రేమగా పిలుస్తూ ఒక కిస్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది

టాలీవుడ్ హీరోకు ప‌బ్లిక్ గా కిస్ పెట్టిన బండ్ల గ‌ణేష్‌ !
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ నిర్మాత‌, ప్రముఖ న‌టుడు బండ్ల గ‌ణేష్ గురించి తెలియ‌ని వారుండ‌రు. ఆయ‌న ఏం చేసినా సంచ‌ల‌నే అవుతుంది. ఈ మ‌ధ్య సినిమాల‌కు దూరంగా ఉంటూ... సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు బండ్ల గ‌ణేష్‌. ఏదో ఒక అంశంపై పోస్టులు పెడుతూ.. ర‌చ్చ చేస్తూంటారు. అలాగే.. స్టేజ్ ఎక్కారంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ జపం చేస్తారు. అయితే... అలాంటి బండ్ల గణేష్ ఇప్పుడు ఓ కుర్ర హీరో వెంట ప‌డుతున్నారు.

మౌళి హీరోగా చేసిన తాజా సినిమా లిటిల్ హార్ట్స్‌. 90s వెబ్ సిరీస్ తో నటుడిగా గుర్తింపు పొందిన మౌళి లేటెస్ట్గా లిటిల్ హార్ట్స్ తో వచ్చాడు. ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం.... శివాని నాగరం హీరోయిన్ గా మెరిశారు. సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత బండ్ల గణేష్ కూడా వచ్చారు.

ఈ నేపథ్యంలోనే హీరో మౌళిని ప్రేమగా పిలుస్తూ ఒక కిస్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ తర్వాత హీరో మౌళిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు బండ్ల గణేష్. సినిమా అద్భుతంగా చేశారని.... తక్కువ బడ్జెట్ లో మంచి సినిమా చేయడం చాలా గ్రేట్ అంటూ వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో ఎవరైనా కష్టాలకు అలాగే కన్నీళ్లకు ప్రిపేర్ అయి ఉండాలని కూడా సూచనలు చేశారు బండ్ల గణేష్. మౌలికి మంచి భవిష్యత్తు ఉందని కొనియాడారు. దీంతో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. క్లిక్

Next Story