- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటుడు బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి బాజాలు
బండ్ల గణేష్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె జానకి వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది.

bandla ganesh
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర నిర్మాత, ప్రముఖ నటుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోల సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేష్, నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో కూడా నిత్యం ఏదో ఒక వివాదాస్పద పోస్ట్ పెడుతూ, వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై స్పందిస్తూ ఉంటారు. ఇటు కోళ్ల ఫారం వ్యాపారంలో కూడా దూసుకు వెళ్తున్న బండ్ల గణేష్, ఇంట అతి త్వరలోనే పెళ్లి బాజాలు మోగలు ఉన్నాయి.
బండ్ల గణేష్ కూతురి వివాహం !
బండ్ల గణేష్ కూతురు జానకి వివాహం ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. అంతేకాదు కాబోయే వధూ వరుల ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. సాంప్రదాయ దుస్తుల్లో బండ్ల గణేష్ కూతురు జానకి, వరుడు సందడి చేశారు. ఈ ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో పెళ్లి చేసుకోబోయే జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే దీనిపై బండ్ల గణేష్ ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. అతి త్వరలోనే ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించే ఛాన్స్ ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.






