- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Peddi Movie: జాన్వీ కపూర్ కు డూప్.. ఈ తెలుగు హీరోయిన్ ఎవరంటే?
బాంధవి శ్రీధర్ అనే టాలీవుడ్ నటిని జాన్వీ కపూర్ స్థానంలో డూప్ గా తీసుకుంటున్నారట. జాన్వీ కపూర్ హైట్ 5

దిశ, వెబ్ డెస్క్: హీరో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. శరావేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్, దాదాపు 70% వరకు పూర్తయినట్లు తెలుస్తోంది. మార్చి 27వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. పెద్ది సినిమాలో అచ్చియమ్మ అనే పాత్రలో జాన్వీ కపూర్ మెరువనున్నారు.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ కు కొన్ని సీన్లలో డూప్ గా తెలుగు అమ్మాయిని తీసుకుంటున్నారట. మసుద సినిమాలో దెయ్యంగా భయపెట్టిన బాంధవి శ్రీధర్ అనే టాలీవుడ్ నటిని జాన్వీ కపూర్ స్థానంలో డూప్ గా తీసుకుంటున్నారట. జాన్వీ కపూర్ హైట్ 5 అడుగుల 4 అంగుళాలు. బాంధవి కూడా సేమ్ హైట్. ఇద్దరి లుక్స్ కూడా చాలా కామన్ గా ఉంటాయి. అందుకే బాంధవిని డూప్ గా తీసుకుంటున్నారట. జాన్వీ కపూర్ ఫ్లైట్ ఖర్చులు, హోటల్ రూం ఖర్చులు ఇతర మెయింటెనెన్స్ లాంటివి ఆదా చేసుకునేందుకు నిర్మాతలు బాంధవిని ఎంపిక చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.






