- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవితేజ చేతుల మీదుగా విడుదల కానున్న బ్యాండ్ మేళం సెకండ్ సింగిల్
బ్యాండ్ మేళం సినిమాకు సంబంధించిన రెండవ సింగిల్ను ఫిబ్రవరి 28వ తేదీన రవితేజ గారి చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : కోర్టు మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న హర్ష, శ్రీదేవి జంటగా బ్యాండ్ మేళం అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని మార్చి 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీకి చాలా రోజుల ముందు నుండి ఈ మూవీ యూనిట్ పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తూ వస్తోంది. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కొంతవరకు ఆసక్తి నెలకొంది.
ఈ మూవీ యూనిట్ వరుసగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలను కూడా విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేశారు. దానికి పర్వాలేదనే స్థాయి స్పందన జనాల నుండి దక్కుతుంది. అలాంటి సమయంలోనే బ్యాండ్ మేళం యూనిట్ రెండవ సింగిల్ విడుదలకు సిద్ధమైంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది.
ఈ సినిమాకు సంబంధించిన రెండవ సింగిల్ను ఫిబ్రవరి 28వ తేదీన రవితేజ గారి చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఈ పాట ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. సతీష్ జవ్వాజి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై కావ్య శ్రావ్య నిర్మించారు.






