Band Melam Trailer: ఆకట్టుకుంటున్న బ్యాండ్ మేళం ట్రైలర్

by Pulgam srinivas |

ఆకట్టుకుంటున్న బ్యాండ్ మేళం ట్రైలర్... రోషన్-శ్రీదేవి జంటకు మరో హిట్టు దక్కేలా ఉందిగా

Band Melam Trailer: ఆకట్టుకుంటున్న బ్యాండ్ మేళం ట్రైలర్
X

దిశ, వెబ్ డెస్క్: కోర్టు చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రోషన్, శ్రీదేవి తాజాగా బ్యాండ్ మేళం అనే చిత్రంలో జంటగా నటించారు. ఈ సినిమాను మార్చ్ 26న విడుదల చేయనున్నారు. దాంతో ఈరోజు ఉదయం చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్‌లో గ్రామీణ నేపథ్యంలో సాగే కథను వినోదాత్మక సన్నివేశాలతో ఆసక్తికరంగా చూపించారు. రోషన్ తన నటనతో మెప్పించగా, శ్రీదేవి నటన, అందంతో ఆకట్టుకుంది. ట్రైలర్‌లో కామెడీ, ఎమోషన్, ప్రేమ అంశాలు సమానంగా కనిపించాయి.

ఈ చిత్రానికి సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించగా, ప్రముఖ కథ రచయిత కోన వెంకట్ నిర్మించారు. ఈ ట్రైలర్‌ను ప్రజెంట్ చేసిన విధానం, ఇందులో వచ్చిన నేపథ్య సంగీతం అన్నీ కలగలిపి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను రేకెత్తిస్తున్నాయి. మరి కోర్టు మూవీతో మంచి సక్సెస్ అందుకున్న ఈ జంట 'బ్యాండ్ మేళం'తో కూడా అదే ఇంపాక్ట్‌ను చూపిస్తుందేమో చూడాలి. ఈ చిత్రాన్ని మొదట మార్చ్ 13న విడుదల చేయాలని అనుకున్నారు. అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున ప్రచారాలను కూడా నిర్వహించారు.

కానీ సడన్గా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో ఈ మూవీ బృందం వెనక్కు తగ్గి సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేసుకుంది. అలా దాదాపు ఈ సినిమా మొదట అనుకున్న దానికంటే రెండు వారాలు ఆలస్యంగా విడుదల అవుతుంది. దానితో ఈ మూవీ బృందం వారు ఈ రెండు వారాల్లో కూడా ప్రమోషన్లను గట్టిగానే నిర్వహించారు. అది కూడా ఈ సినిమాకు కాస్త ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


Next Story