Viral video: కంట్రీ దాటిన బాలయ్య క్రేజ్.. ఇంత ఫర్‌ఫెక్షన్ అస్సలు ఊహించరు!

by Yella Dhawani Reddy |

టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన 'డాకు మహారాజ్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

Viral video: కంట్రీ దాటిన బాలయ్య క్రేజ్.. ఇంత ఫర్‌ఫెక్షన్ అస్సలు ఊహించరు!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన 'డాకు మహారాజ్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో ఊర్వశి రౌతేలాతో బాలకృష్ణ చేసిన ప్రత్యేక సాంగ్ 'దబిడి దిబిడి'కి విశేష స్పందన వచ్చింది. మొదట్లో ఈ సాంగ్‌ను ఇవేం స్టెప్స్, ఇదేం పాట అంటూ విమర్శించిన ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో ట్రెండ్‌ అవుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు భాషతో సంబంధం లేకుండా పాటకు స్టెప్పులు వేస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

ఇక, తాజాగా జపాన్‌కు చెందిన నలుగురు అమ్మాయిలు కలసి 'దబిడి దిబిడి' సాంగ్‌కు స్టెప్పులు వేశారు. ఇందులో లిరిక్స్‌ని పర్ఫెక్ట్‌గా సింక్ చేస్తూ మాస్ స్టెప్స్‌తో అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నటి ఊర్వశి రౌటేల కూడా ఈ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసిందంటే అర్థం చేసుకోండి.. ఎంత పర్‌ఫెక్ట్‌గా స్టెప్పులు వేశారో. ఇక ఇటీవల కాలంలో తెలుగు సాంగ్స్‌కి గ్లోబల్ వైడ్‌గా రీచ్ రావటం హ్యాపీగా ఉందంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, ఇటీవల వచ్చిన సినిమాల్లో పుష్ప సాంగ్ తర్వాత ఆ స్థాయిలో వైరల్‌ అవుతున్న పాట ఇదే కావడం విశేషం. ఇక సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కూడా గ్లోబల్ వైడ్ ట్రెండ్ అయ్యింది. అలాగే, ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' సాంగ్ కూడా బాగానే ట్రెండ్ అయ్యింది.

Next Story