అచ్చ తెలుగు అమ్మాయిల రెడీ అయిన బాలయ్య బ్యూటీ.. క్రేజీ ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్స్

by Gugulothu.Kavitha |

‘విరూపాక్ష’(Virupaksha) మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అచ్చ తెలుగు అమ్మాయిల రెడీ అయిన బాలయ్య బ్యూటీ.. క్రేజీ ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘విరూపాక్ష’(Virupaksha) మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) సరసన ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari), నిఖిల్(Nikhil) సరసన ‘స్వయంభు’(Swayambhu), ‘హైందవ’(Hyndava), బాలయ్య(Balakrishna)తో ‘అఖండ-2’(Akhanda-2) వంటి భారీ ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సంయుక్త తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ శారీ కట్టుకొని, బ్యాంగిల్స్, నగలు, ఇయర్ రింగ్స్ పెట్టుకుని దర్శనమిచ్చింది. అలాగే జడ వేసుకుని అచ్చ తెలుగింటి ఆడపిల్లలా రెడీ అయింది. ఇక ఈ ఫొటోస్‌కు ‘శారీ మోడ్ ఆన్.. ఆల్‌వేస్ ఆన్’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు చీరలో క్రేజీ ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story