- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యంత పవిత్రమైన రోజు అంటూ పూల మాలతో కనిపించి షాకిచ్చిన బాలయ్య బ్యూటీ.. పెళ్లి జరిగిపోయిందా?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ‘మిర్చి లాంటి కుర్రాడు’(Mirchi Lanti Kurradu)సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ‘మిర్చి లాంటి కుర్రాడు’(Mirchi Lanti Kurradu)సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. కానీ మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘కంచె’ (Kanche)చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వచ్చాయి. అలాగే సందీప్ కిషన్, మంచు విష్ణు, కార్తికేయ, వంటి వారితో నటించింది. ఇక 2021లో బాలయ్య(Balakrishna) సరసన ‘అఖండ’ మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj)సినిమాతో వచ్చి ప్రేక్షకులను అలరించడంతో పాటు సూపర్ హిట్ సాధించింది.
ప్రస్తుతం ప్రగ్యా మరోసారి బాలయ్య సరసన జత కట్టబోతుంది. ‘అఖండ-2’(Akhanda-2) చిత్రంలో ఈ భామ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రగ్యా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, ఈ అమ్మడు ఉగాది సందర్భంగా కామాక్య ఆలయానికి వెళ్లింది. ఈ విషయాన్ని తెలుపుతూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన ఆమె అక్కడ దీపాలు పెట్టి మరీ ప్రత్యేక పూజలు చేసింది. అయితే ఈ ఫొటోల్లో ఆమె బంతి పూల మాల మెడలో వేసుకుని కనిపించడం గమనార్హం. ఈ పోస్ట్‌కు ‘‘ఈ అత్యంత పవిత్రమైన రోజున కామాఖ్య దేవాలయంలో అత్యంత అద్భుతమైన దర్శనం అయింది. అందరికీ ఉగాది / గుడి పడ్వా / చైత్ర నవరాత్రి శుభాకాంక్షలు’’ అనే క్యాప్షన్ జత చేసింది.
ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా అసలు ఆమె అక్కడ ప్రత్యేక పూజలు చేయడానికి కారణం ఏంటని? పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. పెళ్లి జరిగిపోయిందా అందుకే అలా పూల మాల వేసుకుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రగ్యా అభిమానులు మాత్రం పూల మాల వేసుకుంటే పెళ్లి జరిగినట్లా అలాంటి పుకార్లు ఆపండి అని ఫైర్ అవుతున్నారు. అయితే ఇటీవల శ్రీలీల కూడా ఇలాగే పూలమాలతో కనిపించిన విషయం తెలిసిందే. దీంతో అంతా పలు రకాలుగా చర్చించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రగ్యా అలాగే కనిపించడంతో ఆమె ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.






