Shraddha Srinath: సంప్రదాయ లుక్స్‌తో దర్శనమిచ్చిన బాలయ్య బ్యూటీ.. వావ్, సూపర్ అంటున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

యంగ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) వరుస సినిమాలో చేస్తూ తన క్రేజ్‌కు పెంచుకుంటోంది.

Shraddha Srinath: సంప్రదాయ లుక్స్‌తో దర్శనమిచ్చిన బాలయ్య బ్యూటీ.. వావ్, సూపర్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) వరుస సినిమాలో చేస్తూ తన క్రేజ్‌కు పెంచుకుంటోంది. నాని ‘జెర్సీ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇటీవల ‘మెకానిక్ రాకీ’(Mechanic Rocky)తో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ ఏడాది బాలయ్య సరసన ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj ) సినిమాలో నటించింది.

బాబి కొల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్(Sreekara Studios), ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై నిర్మించారు. అయితే ‘డాకు మహారాజ్’ జనవరి 12న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రద్దా శ్రీనాథ్ సోషల్ మీడియాలో పలు ఫొటోలు షేర్ చేసింది. పసుపు కలర్ లెహంగా ధరించి అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ ఫొటోలు చూసిన వారంతా వావ్, సూపర్ గార్జియస్, బ్యూటిఫుల్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story