- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Balayya- Thaman: మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య.. పోస్ట్ వైరల్
నందమూరి బాలకృష్ణ(Balakrishna) రీసెంట్‌గా ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) రీసెంట్‌గా ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్(SS Thaman) మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఇక ఇందులో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటించి మెప్పించారు. అయితే సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు కలెక్షన్ల విషయంలోనూ మంచి వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ అయిందనే చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో థియేటర్లలో సౌండ్ బాక్సులు సైతం పగిలిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమన్.. బ్లాక్ బస్టర్ సీక్వెల్ అఖండ-2(Akhand-2)కు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నందమూరి బాలకృష్ణ తాజాగా తనకు ఎంతో ఇష్టమైన తమన్‌కు ఓ ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే సినిమాల కంటే పర్సనల్‌గా బాలయ్య, తమన్ రిలేషన్ ఎక్కువగా ఏర్పడిందన్న సంగతి తెలిసిందే. అందుకే ఏకంగా తమన్‌కు నందమూరి తమన్ అని బాలయ్య పేరు పెట్టేశాడు.
ఈ బంధంతోనే బాలయ్య తాజాగా ఓ కాస్ట్ లీ కారుని గిఫ్ట్‌గా ఇచ్చాడు. దగ్గర దగ్గరగా ఈ కారు విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. న్యూ బ్రాండెడ్ పోర్స్చే కారుని బాలయ్య స్వయంగా కొని, రిజిస్ట్రేషన్ చేయించి మరీ ఇచ్చాడు. ప్రస్తుతం వీరి బాండింగ్‌కు సంబంధించిన ఫొటోలు, కొత్త కారుతో బాలయ్య తమన్ దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అయితే ఇలా కార్లు గిఫ్ట్ అవ్వడం అనేది టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్‌లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కోలీవుడ్‌లో సినిమా సక్సెస్ అయితే నిర్మాత ముందుకు వచ్చి హీరోకి, దర్శకుడిగా, సంగీత దర్శకుడికి కార్లను గిఫ్ట్‌గా ఇస్తుంటాడు. టాలీవుడ్‌లో ఈ సంప్రదాయం చాలా తక్కువ. కానీ ఇలా ఓ హీరోనే సంగీత దర్శకుడికి ప్రేమతో కారుని గిఫ్ట్‌గా ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






