- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకీకి పోటీగా బాలయ్య.. క్లాస్ ప్లస్ మాస్‌తో ఆడియన్స్‌కు ఫుల్ మజా
వెంకటేష్ మూవీతో పాటు బాలకృష్ణ సినిమా కూడా అక్టోబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అవకాశాలు కనిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం ఏకే 47' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా అక్టోబర్ నెలలోనే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ బాలకృష్ణ సినిమా కూడా అక్టోబర్‌లోనే విడుదలైతే, వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో బాలయ్య చిత్రాన్ని అదే సమయంలో విడుదల చేస్తారా? లేక మరో నెల ఖరారు చేస్తారా? అనే అంశం ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.






