- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NBK 111 : మొదలుకానున్న బాలయ్య మూవీ సందడి
ఈరోజు నుండి మొదలుకానున్న బాలయ్య, గోపీచంద్ మలినేని చిత్ర షూటింగ్

దిశ, వెబ్ డెస్క్ : నందమూరి నట సింహం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రం బాలయ్య కెరీర్లో 111వ మూవీగా రూపొందునుంది. దాంతో ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ను NBK 111 అనే వర్కింగ్ టైటిల్తో విడుదల చేశారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మొదట ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చిన తర్వాత ఇది భారీ బడ్జెట్ సినిమా అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అలాగే నయనతార ఇందులో హీరోయిన్గా నటించనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. కానీ నిర్మాత మాత్రం అంత పెట్టడానికి రెడీగా లేకపోవడంతో కథను చేంజ్ చేసి యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీతో ఈ సినిమాను ముందుకు తీసుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ రోజు రాత్రి నుండి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ కానున్నట్లు, నైట్ షెడ్యూల్లో యాక్షన్ ఎపిసోడ్ తో ఈ మూవీ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. 8 రోజులపాటు ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ మొత్తం షెడ్యూల్ కూడా నైట్ లోనే చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన వీరసింహారెడ్డి చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశం ఉంది.






