బాలయ్య నెక్స్ట్ సినిమాకు ఊహించని సంగీత దర్శకుడు

by Pulgam srinivas |

బాలయ్య-కొరటాల కాంబో మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

బాలయ్య నెక్స్ట్ సినిమాకు ఊహించని సంగీత దర్శకుడు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవల వెలువడింది. ఎస్.ఎస్. తమన్ ‘అఖండ’ నుంచి బాలయ్య సినిమాలకు వరుసగా సంగీతం అందిస్తూ వస్తున్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా తమన్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్‌కూ ఆయనే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉంటారని చాలామంది భావించారు. అయితే ఇప్పుడు ఓ సడన్ ట్విస్ట్ వినిపిస్తోంది. ఈ సినిమాకు తమన్ కాకుండా అనిరుద్ రవిచందర్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఇటీవల 'దేవర పార్ట్ 1' సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా అందులో అనిరుద్ ఇచ్చిన సంగీతం మంచి స్పందన పొందింది. అదే కారణంతో ఈ ప్రాజెక్ట్‌కూ ఆయనను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరి ఈ క్రేజీ కాంబో మూవీకి చివరికి ఎవరు సంగీతం అందిస్తారు అనేది తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Next Story