- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్యకు గాయం.. ఆ రెండు సినిమాల విడుదలపై ప్రభావం పడిందా?
బాలయ్యకు గాయం కావడంతో ఆయన తదుపరి సినిమాల విడుదలపై దాని ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: దాదాపు స్టార్ హీరోల సినిమాల విడుదల తేదీలను ముందుగానే ఖరారు చేసి, అదే లక్ష్యంతో చిత్రీకరణను ప్రారంభిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం సరైన సమయంలో విడుదలైన స్టార్ హీరోల సినిమాలకు మంచి టాక్ వస్తే భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉండటమే. అయితే షూటింగ్ ప్రక్రియలో ఏ చిన్న అంతరాయం వచ్చినా విడుదల తేదీ మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాల విషయంలోనూ అలాంటి పరిస్థితి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా కమిట్ అయ్యారు. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న చిత్రాన్ని ఈ ఏడాది దసరా లేదా డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో బాలకృష్ణకు గాయం కావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు.
కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కొంతకాలం షూటింగ్‌లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే బాలకృష్ణ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దర్శకులు ఇతర నటీనటులపై చిత్రీకరణ పూర్తి చేసి, పక్కా ప్రణాళికతో సినిమాలను అనుకున్న సమయానికే విడుదల చేస్తారా? లేక షూటింగ్ ఆలస్యం కారణంగా విడుదల తేదీల్లో మార్పులు వస్తాయా? అనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.






