43 ఏళ్ల హీరోయిన్ కు న‌గ‌లు కొనిచ్చిన బాల‌య్య !

by velandi.Saikiran |

బాలయ్య భార్యగా శ్రియా శరణ్ నటించారు. జనాలను ఆకట్టుకునేందుకు ప్రమోషన్ లో భాగంగా ఆమెకు నగలు కూడా కొనిచ్చారు బాలయ్య.

43 ఏళ్ల హీరోయిన్ కు న‌గ‌లు కొనిచ్చిన బాల‌య్య !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలయ్య ( Balayya) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా కొనసాగుతున్న నందమూరి బాలయ్య, ఇటీవల కాలంలోనే అఖండ 2 సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్నారు. హిందూ, సనాతన ధర్మం చుట్టూ సాగే ఈ సినిమాను జనాలు బాగానే ఆదరించారు. అయితే అలాంటి నందమూరి బాలయ్య ఓ హీరోయిన్ కు నగలు గిఫ్ట్ గా ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అయితే ఇది కేవలం ప్రమోషన్ వీడియో మాత్రమే కావడం గమనార్హం. నందమూరి బాలయ్య, టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ ( Shriya Saran ) ఇద్దరు వేగ జువెలర్స్ కు ( Vega Jewellers ) బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఈ తరుణంలోనే ప్రమోషన్ వీడియో చేశారు. ఇందులో నందమూరి బాలయ్య భార్యగా శ్రియా శరణ్ నటించారు. జనాలను ఆకట్టుకునేందుకు ప్రమోషన్ లో భాగంగా ఆమెకు నగలు కూడా కొనిచ్చారు బాలయ్య. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. క్లిక్

Next Story