- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Balakrishna: డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో ఆ హీరోయిన్‌తో అలా చేస్తూ రెచ్చిపోయిన బాలయ్య.. వీడియో వైరల్
బాలకృష్ణ(Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj).

దిశ, సినిమా: బాలకృష్ణ(Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). దీనిని శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sithara Entertainments), ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగవంశీ(Naga Vamsi) నిర్మించగా.. బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath), ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఇందులో బాలయ్య సరసన ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) ఐటమ్ సాంగ్‌లో చెందులేసింది. అయితే ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్‌లో విడుదలైంది.
వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ టీమ్ సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఊర్వశీ చీరకట్టుకుని వచ్చి ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. అలాగే బాలయ్య కూడా పాల్గొన్నారు. వీరిద్దరు కలిసి పార్టీ ఎంజాయ్ చేయడంతో పాటు డాకు మహారాజ్ పాటకు డ్యాన్స్ చేశారు. ఇందులో బాలయ్య ఆమెను ముందు భాగంలో కొడుతుండగా.. ఊర్వశి(Urvashi) దూరం జరుగుతూ అసౌకర్యంగా ఫీల్ అయింది.
అయినప్పటికీ బాలయ్య మాత్రం ఆమెతో కపుల్ డ్యాన్స్ చేసి దగ్గరకు వెళ్లారు. అంతేకాకుండా మరోసారి పాటలో లాగా కొట్టారు. దీంతో ఊర్వశి ఇబ్బంది పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా కూతురు వయసున్న ఆమెతో అలాగేనా ప్రవర్తించేది అని విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా సినిమాలో అంటే నటన అనుకోవచ్చు కానీ బయట కూడా ఇలా చేయడమేంటని పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.






