గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పిన బాలయ్య

by velandi.Saikiran |

నందమూరి బాలయ్య అదిరిపోయే డైలాగ్ తో రెచ్చిపోయాడు. తాను నటించిన ఒక్క మగాడు సినిమాలోని డైలాగ్ ను

గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పిన బాలయ్య
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన బాలయ్య, ఇప్పుడు టాలీవుడ్ ను దున్నేస్తున్నారు. వరుస సినిమాలతో దూసుకు వెళ్లడమే కాకుండా, అటు రాజకీయాల్లో కూడా తన సత్తా చాటుతున్నారు. అయితే అలాంటి నందమూరి బాలయ్య తాజాగా అఖండ 2 సినిమా చేసిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను, నందమూరి బాలయ్య కాంబినేషన్ లో ఈ సినిమా వస్తోంది.

డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. నందమూరి బాలయ్య హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేసిన ఈ అఖండ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని కూకట్ ప‌ల్లిలో నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈవెంట్ లో నందమూరి బాలయ్య పాల్గొని, స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఈ మూవీ ఈవెంట్ సందర్భంగా నందమూరి బాలయ్య అదిరిపోయే డైలాగ్ తో రెచ్చిపోయాడు. తాను నటించిన ఒక్క మగాడు సినిమాలోని డైలాగ్ ను స్టేజ్ మీద గుక్క తిప్పకుండా చెప్పి అదరగొట్టారు. అంతేకాదు అఖండ 2 సినిమా గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసి సినిమాలు చేశానని, అఖండ 2 మాత్రం చాలా భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు.

తాను అలాగే బోయపాటి శ్రీను సినిమా చేయాలనుకుంటే మూడు నిమిషాల్లో మాట్లాడుకుంటామని వెల్లడించారు. ఆ మూడు నిమిషాల్లోనే సినిమా ఫైనల్ అయి, షూటింగ్ దాకా వెళుతుందని తెలిపారు బాలయ్య.నటన అంటే మరో ఆత్మలోకి ప్రవేశించడం అని, తాను పాదరసం లాంటి వాడిని అంటూ పేర్కొన్నారు. ఏ ఛాలెంజ్ అయిన తాను స్వీకరించి, కచ్చితంగా చేస్తానని స్పష్టం చేశారు. ఒక నటుడిగా అలాగే ఎమ్మెల్యేగా, బసవతారకం ఆసుపత్రి చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నట్లు గుర్తు చేశారు. అయినా కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు కృషి చేస్తానన్నారు నంద‌మూరి బాల‌య్య‌. క్లిక్

Next Story