- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Balayya: ఇది తెలుగు సినిమా కాదు, భారతీయులందరిదీ
నందమూరి బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను ఇద్దరు కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను, నందమూరి బాలయ్య కాంబినేషన్ వచ్చిన ఈ అఖండ 2 లో ఇరగదీస్తోంది. డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే వంద కోట్ల కలెక్షన్స్ దాటింది. రూ. 200 కోట్లు రాబట్టేందుకు దూసుకు వెళ్తోంది. హిందూ ధర్మం చుట్టూ నడిచే ఈ కథాంశం జనాలకు బాగా ఎక్కింది. దీంతో లాజిక్ అనేది చూడకుండా సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు.
అయితే సినిమా సక్సెస్ కావడంతో తాజాగా నందమూరి బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను ఇద్దరు కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారణాసిలో బాలయ్య మాట్లాడుతూ.. అఖండ 2 తెలుగు వాళ్ళ సినిమా కాదని, ఇది భారతీయులందరూ చూడాల్సిన చిత్రమంటూ పేర్కొన్నారు. మంచి సినిమా కోసం చేసిన ప్రయత్నం ఇప్పుడు సక్సెస్ అయిందని వివరించారు. తమ సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బాలయ్య. దేశం, ధర్మం అలాగే హిందుత్వం చుట్టూ ఈ సినిమాను తీసినట్లు వివరించారు. సనాతన ధర్మ పరిరక్షణ అవశ్యకతను అఖండ 2 చాటిందని తెలిపారు.






