B.Gopal: నాలుగు హిట్స్ ఇచ్చిన దర్శకుడితో బాలయ్య సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

by Pulgam srinivas |

బాలయ్య-గోపాల్ కాంబినేషన్‌లో లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్‌లో అనౌన్స్ అయిన హర హర మహాదేవ సినిమా ఆగిపోయింది.

B.Gopal: నాలుగు హిట్స్ ఇచ్చిన దర్శకుడితో బాలయ్య సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన కాంబినేషన్లలో బాలకృష్ణ, బి గోపాల్ కాంబో ఒకటి. మొదటగా వీరి కలయికలో లారీ డ్రైవర్ అనే చిత్రం వచ్చింది. ఇది అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత రౌడీ ఇన్‌స్పెక్టర్ అనే సినిమా రూపొందింది. ఇది ఆ సమయంలో భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో సినిమా రావడానికి కాస్త ఎక్కువ సమయం పట్టింది. కానీ ఈసారి వచ్చిన సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్టును సొంతం చేసుకుంది.

అది ఏ సినిమా అనుకుంటున్నారా? అదే సమరసింహారెడ్డి. వీరి కాంబోలో మూడవ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా బి గోపాల్ నరసింహ నాయుడు అనే చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్ విజయాలను బాలయ్యకు అందించిన ఈ స్టార్ డైరెక్టర్ బాలయ్యతో ఐదవ సినిమాగా పల్నాటి బ్రహ్మ నాయుడు అనే చిత్రాన్ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.

ఈ డిజాస్టర్ తర్వాత బాలయ్యతో ఆరవ సినిమాగా గోపాల్ 'హర హర మహాదేవ' అనే టైటిల్ తో ఓ మూవీని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు, పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో గోపాల్ మాట్లాడుతూ... ఆ సినిమా స్టార్ట్ చేసే సమయానికి మా దగ్గర కథ లేదు. ఆ తర్వాత స్టోరీ సెట్ అవుతుంది అనుకొని మేము సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశాం. కానీ ఎంత ప్రయత్నించినా కూడా మాకు మంచి కథ దొరకలేదు, దానితో ఆ సినిమాను అక్కడే ఆపేశాం అని చెప్పుకొచ్చాడు.

Next Story