- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Akhanda 2 OTT: అఖండ 2 ఓటిటి డేట్ ఫిక్స్..ఎప్పుడంటే?
అఖండ 2 ఓటిటి డేట్ ఫిక్స్. జనవరి 9వ తేదీన ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారట.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య లేటెస్ట్ గా నటించిన సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను, నందమూరి బాలయ్య కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చింది. డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. నందమూరి బాలయ్య ఈ మూవీలో హీరోగా చేయగా సంయుక్త మీనన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఆది పినిశెట్టి విలన్ గా మెరిశారు. హిందుత్వం, సనాతన ధర్మం చుట్టూ ఈ కథాంశం ఉన్న నేపథ్యంలో జనాలకు బాగానే నచ్చింది.
అంతేకాదు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు కూడా రాబట్టిందట ఆఖండ 2. అయితే అలాంటి అఖండ 2 సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైందట. జనవరి 9వ తేదీన ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారట. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు టాక్ నడుస్తోంది.






