Akhanda 2: అఖండ 2 మూవీ 11 రోజుల కలెక్షన్లు..ఎన్ని కోట్లంటే !

by velandi.Saikiran |

అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే నందమూరి

Akhanda 2: అఖండ 2 మూవీ 11 రోజుల కలెక్షన్లు..ఎన్ని కోట్లంటే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలయ్య హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ సినిమా వచ్చి సక్సెస్ కాగా, ఇప్పుడు అఖండ 2ను కూడా జనాలు ఆదరించారు. హిందుత్వం, సనాతన ధర్మం, ఆధ్యాత్మిక అంశాలతో రూపొందించిన ఈ సినిమాను చూసేందుకు కుటుంబ సమేతంగా జనాలు తరలివస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయిన అఖండ 2, దాదాపు 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఈ 11 రోజులలో రూ.112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 88.25 కోట్లు రాబట్టినట్లు లెక్కలు చెబుతున్నాయని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి పది రోజులు కోటికి తగ్గకుండా షేర్ ను ఈ సినిమా రాబట్టిందట. క్రిస్మస్ పండగ అయిపోయే వరకు ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దుమ్ము లేపే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక సంక్రాంతి కానుకగా ఓటీటీలోకి కూడా రానున్నట్లు సమాచారం.

Next Story