అఖండ 2లో ఐటెం సాంగ్ లేదు..క్లారిటీ ఇచ్చిన బాల‌య్య‌

by velandi.Saikiran |   (  Updated:2025-11-28 19:52:59  IST  )

అఖండ 2 సినిమాలో ఐటెం సాంగ్ ఉంద‌న్న వార్త‌ల‌పై హీరో నంద‌మూరి బాల‌య్య క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో సంయుక్త మీన‌న్ చేసిన

అఖండ 2లో ఐటెం సాంగ్ లేదు..క్లారిటీ ఇచ్చిన బాల‌య్య‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అఖండ 2 సినిమాలో ఐటెం సాంగ్ ఉంద‌న్న వార్త‌ల‌పై హీరో నంద‌మూరి బాల‌య్య క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో సంయుక్త మీన‌న్ చేసిన జాజికాయ జాజికాయ పాట అద్భుతంగా వ‌చ్చింద‌న్నారు. ఈ పాటను అంద‌రూ ఐటెం సాంగ్ అనుకుంటున్నారు... కానీ అది ఐటెం సాంగ్ కాదు, సినిమాలో ఓ పుట్టిన రోజు సీన్ సంద‌ర్భంగా జాజికాయ జాజికాయ పాట వ‌స్తుంద‌ని తెలిపారు హీరో నంద‌మూరి బాల‌య్య. అఖండ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్ర వారం రోజున‌ హైద‌రాబాద్ లోని కూక‌ట్ ప‌ల్లిలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌య్య మాట్లాడారు.

కరోనాతో భారతదేశమంతా భయపడుతున్న తరుణంలో అఖండ చిత్రాన్ని విడుదల చేసి ఘన విజయాన్ని అందుకున్నామ‌ని గుర్తు చేశారు బాల‌య్య‌. ఇక ఇప్పుడు అఖండ 2 సినిమా వ‌స్తున్న‌ట్లు పేర్కొన్నారు. మహా శివుడు శక్తి, ఆదిశక్తి సాక్షిగా గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో చెబుతున్నానని... ఈ రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై, ఆ త్రినేత్రుడి వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై, ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శూలమై.. ఎలా ఉండబోతుందో నా పాత్ర మీరు తెరపై చూస్తార‌న్నారు.

బోయపాటి నేను ఏదైనా సినిమా చేయాలనుకుంటే మూడే నిమిషాలు మాట్లాడుకుంటామ‌న్నారు. ఆ మహా యజ్ఞంలోకి దిగిపోతామ‌ని వెల్ల‌డించారు బాల‌య్య‌. నేను పాదరసం లాంటివాడిని ఎందులోకి వెళ్తే ఆకారం సంతరించుకుంటానని వివ‌రించారు. కాగా అఖండ 2 సినిమాలో హీరోగా నంద‌మూరి బాల‌య్య చేయ‌గా, హీరోయిన్ గా సంయుక్త మీన‌న్ మెరువ‌నున్నారు. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ చాలా గ్రాండ్ గా తీసింది. ఇక ఈ మూవీలో ఆది పినిశెట్టి మెయిన్ విల‌న్ గా క‌నిపించ‌నున్నారు. కాగా, నంద‌మూరి బాల‌య్య చేసిన అఖండ 2 మూవీ డిసెంబ‌ర్ 5వ తేదీన రిలీజ్ కానుంది. మ‌రి ఈ సినిమా ఏ మేర‌కు జ‌నాల‌ను ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Next Story