NBK111 అప్‌డేట్.. ఆ డైరెక్టర్‌తో మరోసారి చేతులు కలిపిన బాలకృష్ణ

by Chukka Sudharani |

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం ‘అఖండ-2’తో బిజీగా ఉన్నాడు.

NBK111 అప్‌డేట్.. ఆ డైరెక్టర్‌తో మరోసారి చేతులు కలిపిన బాలకృష్ణ
X

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం ‘అఖండ-2’తో బిజీగా ఉన్నాడు. సెన్సేషనల్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా టీజర్ కూడా సోమవారం రాబోతున్నట్లు అనౌన్స్‌మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. బాలకృష్ణ మరో సినిమా అప్‌డేట్ రావడంతో అభిమానుల్లో ఉత్సహం మరింత రెట్టింపు అయింది. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్షన్‌లో బాలకృష్ణ తన ‘NBK111’ సినిమాను చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘రోరింగ్ బ్లాక్ బస్టర్ కాంబో తిరిగివస్తుంది.. చారిత్రక గర్జన ప్రారంభమవుతుంది’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ పోస్టర్ ప్రజెంట్ వైరల్ అవుతుండగా.. గూస్ బంప్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య, గోపీచంద్ కాంబోలో ఇప్పటికే వచ్చిన ‘వీర‌సింహ‌రెడ్డి’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో ‘NBK111’పై ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.

Next Story