సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా డిక్షనరీలో లేదు.. వైరల్‌గా బాలయ్య బాబు కామెంట్స్

by Chukka Sudharani |

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ 2’ నుంచి ‘ది తాండవం’ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా డిక్షనరీలో లేదు.. వైరల్‌గా బాలయ్య బాబు కామెంట్స్
X

దిశ, సినిమా: నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ 2’ నుంచి ‘ది తాండవం’ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రజెంట్ ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మంచి వ్యూస్ సొంతం చేసుకుంటుంది. ఇక సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఉన్నాను. సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా డిక్షనరీలో లేదు. హిందూ సనాతన ధర్మం శక్తి పరాక్రమం అఖండ 2 సినిమాలో చూస్తారు. ధర్మంగా బ్రతకండి సత్యం మాట్లాడండి అన్యాయానికి తలవంచకండి.. ఇది అఖండ తాండవం. బోయపాటితో మూడు సినిమాలు చేశాం. సింహ, లెజెండ్, అఖండ.. మూడు హ్యట్రిక్స్. ఇది నాలుగో సినిమా. బోయపాటి నేను ఒకటే వేవ్ లెంత్‌లో వర్క్ చేస్తాం.

హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఈ పాట ఎంతో అద్భుతంగా వచ్చింది. ప్రతిఒక్కరు తమ పిల్లల్ని తీసుకెళ్లి ఈ సినిమాని చూపించాలి. మన హిందూ సనాతన ధర్మం ఏమిటో చెప్పాలి. అఖండ2 చాలా అద్భుతమైన సినిమా. డిసెంబర్ 5న మీ ముందుకు వస్తుంది. ముంబై ఈవెంట్‌లో ఈ సాంగ్‌ని లాంచ్ చేయడం ఇక్కడి నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ థాంక్యు. జైహింద్.. జై భారత్.. జై హైందవ సనాతన ధర్మం’ అని అన్నారు. కాగా.. నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’ చిత్రం.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అఖండకు సీక్వెల్‌గా రాబోతున్నది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్స్ ఇస్తూ.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి మరింత తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story