Akhanda-2: ఆ హీరో కోసం వెనక్కి తగ్గిన బాలయ్య బాబు!

by Chukka Sudharani |   (  Updated:2025-08-02 15:31:39  IST  )

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘అఖండ-2’.

Akhanda-2: ఆ హీరో కోసం వెనక్కి తగ్గిన బాలయ్య బాబు!
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘అఖండ-2’ (Akhanda-2). బ్లాక్ బస్టర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీపై నందమూరి ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. 14రీల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తుండగా.. బాలయ్య చిన్న కూతురు తేజస్విని సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది.

ఇందులో సంయుక్త (Samyuktha) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అనౌన్స్ చెయ్యగా.. తాజాగా ఈ మూవీ వాయిదా పడినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ కూడా రిలీజ్ ఉండటంతో.. రెండు ఒకేసారి రిలీజ్ చేయడం ఎందుకని మాట్లాడుకున్నారట మేకర్స్. దీంతో బాలకృష్ణ సినిమాను పోస్ట్ పోన్ చేసేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తుంది. ‘అఖండ-2’ రిలీజ్ వాయిదాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు కొత్త రిలీజ్‌పై అప్డేట్ కూడా రావాల్సి ఉంది.

Next Story