Akhanda 2: బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు గూస్ బంప్సే.. సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో అంటూ ‘అఖండ 2’ నుంచి బ్లాస్టింగ్ రోర్

by Chukka Sudharani |   (  Updated:2025-10-24 11:49:55  IST  )

నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా చూస్తున్న మోస్ట్ వెయిటెడ్ సినిమా ‘అఖండ-2’.

Akhanda 2:  బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు గూస్ బంప్సే.. సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో అంటూ ‘అఖండ 2’ నుంచి బ్లాస్టింగ్ రోర్
X

దిశ, సినిమా: నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా చూస్తున్న మోస్ట్ వెయిటెడ్ సినిమా ‘అఖండ-2’. మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై గత కొద్ది రోజులుగా సస్పెన్స్ నెలకొనగా.. తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ బ్లాస్టింగ్ రోర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో.. ఏ సౌండ్‌కి నవ్వుతానో ఏ సౌండ్‌కి నరుకుతానో నాకే తెలియదు కొడుకా.. ఊహకి కూడా అందదు’ అంటూ బాలకృష్ణ మాస్ డైలాగ్స్‌తో యాక్షన్ సీన్స్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించారు మేకర్స్.

విడుదలైన కొద్ది సేపటికే ఈ బ్లాస్టింగ్ రోర్ నెట్టింట వైరల్ అవుతూ అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంటుంది. కాగా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు రిలీజైన బ్లాస్టింగ్ రోర్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఎం తేజస్విని సమర్పణలో రామ్ అచంట, గోపీ అచంట నిర్మి్స్తున్నారు. ఇందులో సంయుక్త, హర్షల్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించబోతున్నాడు. లింక్

Next Story