స్టేజీపైనే రెచ్చిపోయిన బాల‌య్య‌..ఫ్యాన్స్‌పై సీరియ‌స్‌

by velandi.Saikiran |

నందమూరి బాలయ్యతో ఫోటోలు దిగేందుకు ఎగ‌బ‌డ్డారు. దీంతో స్టేజ్ మీద ఉన్న‌ బాలయ్య ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.

స్టేజీపైనే రెచ్చిపోయిన బాల‌య్య‌..ఫ్యాన్స్‌పై సీరియ‌స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి బాలయ్య, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కుర్ర హీరోలకు కూడా గట్టి పోటీ నేస్తున్నారు బాలయ్య. అయితే ప్రస్తుతం అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన తాండవం లిరికల్ వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. ముంబైలో ఈ ఈవెంట్ జరగగా నందమూరి బాలయ్య సందడి చేశారు.

ఈ సందర్భంగా అభిమానులు నందమూరి బాలయ్యతో ఫోటోలు దిగేందుకు ఎగ‌బ‌డ్డారు. దీంతో స్టేజ్ మీద ఉన్న‌ బాలయ్య ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. అలా మీద పడిపోతారేంటి ? అంటూ కోపంతో అభిమానుల మీద క‌న్నెర్ర చేశారు నందమూరి బాలయ్య. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా ఇలా అభిమానులపై నందమూరి బాలయ్య సీరియస్ కావడం కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇది ఇలా ఉండ‌గా బాల‌య్య న‌టించిన అఖండ 2 మూవీ డిసెంబ‌ర్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాను బోయ‌పాటి శ్రీను చాలా గ్రాండ్ తెర‌కెక్కించారు. క్లిక్

Next Story