4 హిట్లు కొట్టా..అవార్డు రావడానికి ఇదే కరెక్ట్ టైం: బాలయ్య

by Ajay Maddhiboyina |

నంద‌మూరి బాల‌కృష్ణ ఢిల్లీలో ప‌ద్మభూష‌ణ్ అవార్డు అందుకున్న త‌ర‌వాత మీడియాతో మాట్లాడారు.

4 హిట్లు కొట్టా..అవార్డు రావడానికి ఇదే కరెక్ట్ టైం: బాలయ్య
X

దిశ, వెబ్ డెస్క్: నంద‌మూరి బాల‌కృష్ణ ఢిల్లీలో ప‌ద్మభూష‌ణ్ అవార్డు అందుకున్న త‌ర‌వాత మీడియాతో మాట్లాడారు. త‌న‌కు అవార్డు ఇవ్వ‌డంపై కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న‌కు ఈ అవార్డు ఎప్పుడో రావాల‌ని కొంత‌మంది అన్నార‌ని కానీ ఇదే స‌రైన స‌మ‌యం అని చెప్పారు. న‌టుడిగా 4 హిట్లు కొట్టాన‌ని, ఇండ‌స్ట్రీలో 50ఏళ్లు పూర్తి చేసుకున్నాన‌ని తెలిపారు. క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి చైర్మ‌న్‌గా 15ఏళ్లు పూర్తి చేసుకున్నానని చెప్పారు. నంద‌మూరి బాల‌య్య ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సింహ సినిమాకు ముందు బాల‌య్య‌కు వ‌రుస ఫ్లాపులు ప‌డ‌టంతో కెరీర్లో కొంత ఇబ్బంది పడినా సింహ‌తో ఆయ‌న మ‌ళ్లీ పుంజుకున్నారు. ఆ త‌ర‌వాత లెజెండ్, అఖండ సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఎమ్మెల్యేగా ప్ర‌జాసేవ చేస్తూ మ‌రోవైపు సినిమాల్లోనూ దూసుకుపోతున్నారు.

Next Story